1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 జులై 2016 (11:22 IST)

ఎండిన బ్లూబెర్రీలను స్నాక్స్‌గా తీసుకుంటే..?

ఎండిన బ్లూబెర్రీలను స్నాక్స్‌గా తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్లూబెర్రీలో వయసు సంబంధిత మతిమరపు వంటి వాటిని తగ్గించి వేస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. బ్లూబెర్రీలో

ఎండిన బ్లూబెర్రీలను స్నాక్స్‌గా తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్లూబెర్రీలో వయసు సంబంధిత మతిమరపు వంటి వాటిని తగ్గించి వేస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. బ్లూబెర్రీలో ఉండే ఫ్లావనాయిడ్‌లు అనే యాంటీ ఆక్సిడెంట్‌లు యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. 
 
ఎక్కువ కాలం పాటూ యవ్వనంగా కనపడాలనుకుంటే.. మీ డైట్‌లో బ్లూబెర్రీలను కలుపుకోండి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు అకాల వృద్దాప్యాన్ని అడ్డుకుంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడు పనితీరు స్థిరీకరిస్తాయి. 
 
బ్లూబెర్రీలకు నీలి రంగును ఆపాదించే ఆంతోసైనిన్‌లు కేన్సర్ కారకాలను నశింపజేస్తాయి.  ఇవి కోలన్ కేన్సర్, లేదా ఇతర కేన్సర్లను కూడా దూరం చేస్తాయి. అందుచేత బ్లూబెర్రీలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు.