Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇనుము'తో బట్టతలకు అడ్డుకట్ట

Updated: మంగళవారం, 27 నవంబరు 2018 (09:53 IST)
చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఇపుడు ప్రతి ఒక్కరూ బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. అంటే.. వాతావరణంలో ఏర్పడిన మార్పులతో పాటు.. తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల కారణంగా వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఫలితంగా చిన్నవయసులోనే బట్టతల వచ్చేస్తుంది. 
 
సాధారణంగా, వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభం కావడంతో చాలా మంది షాంపూలు, హెయిర్‌ మాస్కులు వాడటం చేస్తుంటారు. సీరమ్స్‌, ఇతర మందులు తీసుకుంటూ ఉంటారు. అయితే వీటితోపాటు చేయాల్సిన ముఖ్యమైన పని ఇంకోటుంది. అదే ఆహారంలో ఐరన్‌ తీసుకోవడం. 
 
రోజూ తగినంత ఐరన్‌ అందకుంటే జుట్టు రాలిపోతుందని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన అంశాలు, చర్మ సమస్యలు, మానసిక ఇబ్బందులు, కాలుష్యంతోపాటు ఐరన్‌ లోపం కూడా వెంట్రుకలు రాలేందుకు ప్రధాన కారణమవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అందుకే ఆహారంలో రోజూ తప్పని సరిగా ఐరన్‌ శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. సాధారణంగా మాంసాహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. శాకాహారంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి శాకాహారులు ఐరన్‌ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. 
 
మహిళలు రోజూ 18 మిల్లీ గ్రాములు, పురుషులు 8 మిల్లీ గ్రాముల ఐరన్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిక్కుళ్లు, పొద్దు తిరుగుడు గింజలు, పాలు, పాల పదార్థాలు, డ్రై ఫ్రూట్స్‌లలో ఐరన్‌ అధికంగా ఉంటుందని, వీటిని తీసుకోవడం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

అన్నీ చూడండి

జైలులోనే మృతి చెందిన సిక్కు అల్లర్ల కేసులో దోషి సజ్జన్ కుమార్

నైట్ సూట్ వీడియోలు షేర్ చేసిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్... (వీడియో)

తీరనున్న గూడురు రైల్వే స్టేషన్ కష్టాలు - గుమ్మిడిపూండి వరకు నాలుగో లైన్

పాకిస్తాన్‍లో సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ దారుణ హత్య

ఇరాన్‌కు సాయం చేసేవారి అంతు చూస్తాం : డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

Aditi Shankar: అనుపమ పరమేశ్వరన్‌కు వత్తాసు పలికి అదితి శంకర్

త్రిష- నందినిరెడ్డి కాంబోలో సూపర్‌నేచురల్ థ్రిల్లర్

Sushmita Konidela: సుష్మిత కొణిదెల నిర్మించిన జగమే సంగీతం అమెజాన్ లో రాబోతోంది

Chiru 71st birthaday: చిరంజీవి బాస్ ఆఫ్ స్టైల్ అన్న మెహర్ రమేష్ - లివింగ్ లెజెండ్ అన్న థమన్

Suhas and Suri: మండాడి నుంచి సుహాస్ పోస్టర్, ఇంకోవైపు సూరి లవ్ ట్రాక్ విడుదల

తర్వాతి కథనం
Show comments