1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By CHJ
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2016 (20:36 IST)

వెల్లుల్లి ఎందుకంటే ...?!

వెల్లుల్లి కూరలకు ఎంత అదనపు రుచినిస్తుందో ఆరోగ్యానికీ అంతే మేలు చేస్తుంది. అయితే దీన్ని ఇతర పదార్థాలతో కలిపి కాకుండా... పరగడుపున తీసుకుంటే మరింత మంచి ఫలితాలుంటాయి. 
 
• వెల్లులి సహజ యాంటీ బయోటిక్‌గా పని చేస్తుంది. దీన్ని ఉదయం అల్పాహారం కంటే ముందుగా తీసుకోవడం వల్ల పొట్టలో బ్యాక్టీరియా దూరమవుతుంది. అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల కాలేయం పనితీరు మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, ఆకలి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. 
 
• వెల్లులి... శరీరంలోని వ్యర్థాలనూ, క్రిముల్నీ బయటకు పంపేస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఇది చక్కని పరిష్కారం. ఆస్తమా, న్యుమోనియా వంటివి తరచూ బాధిస్తుంటే వెల్లుల్లిని ఆహారంలో తరచూ తీసుకుంటే మంచిది. అయితే కొందరి శరీరతత్వాన్ని బట్టి వెల్లుల్లి పడకపోవచ్చు. అచ్చంగా వెల్లుల్లి తీసుకున్నప్పుడు వేడి చేయడం, తలనొప్పి రావడం జరుగుతుంది. అలాంటి లక్షణాలు గమనించుకుని తక్కువ మోతాదులో తింటే సరిపోతుంది.