నువ్వుల నూనెతో అలా చేస్తే హాయిగా నిద్రపడుతుంది...

మన దైనందిన జీవితంలో ప్రతినిత్యం వివిధ రకాల ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో ముఖ్యమైనవి నువ్వులు. వీటిలో నల్లనువ్వులు, తెల్లనువ్వులు, గోధుమరంగు నువ్వులు అని మూడు రకాలు ఉన్నాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నువ్వులు శరీరపోషణకు, ఆరోగ్య పరిరక

శనివారం, 16 జూన్ 2018 (21:22 IST)
మన దైనందిన జీవితంలో ప్రతినిత్యం వివిధ రకాల ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో ముఖ్యమైనవి నువ్వులు. వీటిలో నల్లనువ్వులు, తెల్లనువ్వులు, గోధుమరంగు నువ్వులు అని మూడు రకాలు ఉన్నాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నువ్వులు శరీరపోషణకు, ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు చేస్తాయి. వీటితోటి నువ్వుల పచ్చడి, నువ్వులపొడి, నువ్వుల చిమ్మిలి వంటి పదార్ధాలను తయారుచేసుకోవచ్చు. నువ్వుల నుండి తీసిన నూనెను పూజకు, హోమాలకు ఉపయోగిస్తూఉంటారు. వీటిని వేయించి ఔషధాల తయారీలో వాడుతుంటారు. ఏయే సమస్యకు ఎలా వుపయోగించుకోవాలో చూద్దాం.
 
1. రక్తహీనత తగ్గేందుకు... 100 గ్రాముల నల్ల నువ్వులలో, 100 గ్రాముల బెల్లం కలిపి దంచి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఉసిరికాయంత తిని, ఆ తర్వాత 100 మిల్లీ లీటర్ల పాలు లేదా, గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులు బెల్లం లేకుండా కేవలం 5 గ్రాముల నల్లనువ్వుల పొడిని 100 మిల్లీ లీటర్ల వేడి పాలలో కలిపి రాత్రిపూట త్రాగుతుండాలి.
 
2. కీళ్ల నొప్పులకు... నువ్వుల చూర్ణం, సొంఠి చూర్ణం సమానంగా కలిపి ఉంచుకొని రెండు పూటలా పూటకు అర టీస్పూన్ చొప్పున తేనెతో కలిపి వాడాలి. చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు 100 మిల్లీ లీటర్ల పాలు లేదా నీళ్లతో కలిపి త్రాగాలి. 
 
3. నోటిపూతకు... నువ్వుల చూర్ణం, పటికబెల్లం పొడి ఒక్కొక్కటి 50 గ్రా. చొప్పున తీసుకొని రెండింటిని కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రెండు పూటలా అరస్పూన్ పొడిని ఒక టీస్పూన్ వెన్నతో కలిపి సేవించడం వలన నోటిపూత తగ్గుతుంది.
 
4. సుఖనిద్ర... నువ్వుల నూనెను బాగా వేడి చేసి పక్కన పెట్టి నాల్గవ వంతు కర్పూరం కలిపి మూతపెట్టి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజుకు ఒకసారి అరికాళ్లకు మర్దన చేస్తుంటే చక్కటి నిద్ర పడుతుంది.

అన్నీ చూడండి

వాట్సప్ ద్వారా వచ్చిన లింక్ పైన క్లిక్ చేసాడు, అంతే... రూ. 10 లక్షలు కాజేశారు

ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య

కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. వేధించిన డాక్టర్.. వీడియో తీసి?

జూలై 21, 22 తేదీల్లో వికారాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Donkeys, Frogs: సీమలో వర్షాల్లేవు.. గాడిదలు, కప్పలకు వివాహాలు

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments