ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 16 మార్చి 2018 (17:53 IST)

నిద్రే ఆరోగ్యం... ఏం చేయాలి?

నిద్ర అనేది మనిషి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. నిద్రలేమితోనే అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. ఇదివరకు కేవలం 6 నుంచి 7 గంటలు మాత్రమే పని దినములు వుండేవి. ఇప్పుడు ఇవి కాస్తా రెట్టింపయ్యాయి. ఒక మనిషి 10 నుంచి 14 గంటలు పని చేయాల్సి వస్తుంది. దీనితో కంటికి సర

నిద్ర అనేది మనిషి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. నిద్రలేమితోనే అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. ఇదివరకు కేవలం 6 నుంచి 7 గంటలు మాత్రమే పని దినములు వుండేవి. ఇప్పుడు ఇవి కాస్తా రెట్టింపయ్యాయి. ఒక మనిషి 10 నుంచి 14 గంటలు పని చేయాల్సి వస్తుంది. దీనితో కంటికి సరిపడా నిద్ర పోలేకపోతున్నారు. అయితే నిద్ర కోసం మిగిలిన ఆ సమయాన్ని కూడా చాలామంది టీవీలు, సెల్ ఫోన్లు చూసుకుంటూ వృధా చేసి నిద్రపట్టక సతమతమవుతారు. అందువల్ల నిద్రకు సహకరించే ఆహారాన్ని తీసుకుంటే టీవీలు చూస్తున్నా నిద్ర తన్నుకుంటూ వస్తుంది. 
 
మన పెద్దవారు పడుకోగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. కానీ మనకు మామూలు నిద్ర కూడా రావడం లేదు. దానికి ఎన్నో కారణాలు. నిద్రపోకుంటే లేనిపోని రోగాలు ఖాయమంటున్నారు వైద్యులు. పెద్దవారికి 6 నుంచి 8 గంటల నిద్ర, చిన్న పిల్లలకు ఇంకా ఎక్కువ. నిద్రలేమితో బాధపడేవారి  బాధ వర్ణనాతీతం. వారు నిద్ర రావడం కోసం మద్యం సేవించడం, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం చేస్తుంటారు. ఆర్టీఫీసియల్‌గా రప్పించే విధానం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే సహజంగా నిద్ర రప్పించే మందు ఒకటి ఉంది. అదే అరటిపండు.
 
అరటిపండులో మెగ్నీషియం అనే మినరల్ ఉంది. మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. అందువల్ల పెయిన్స్ తగ్గించి నిద్రవచ్చేలా చేస్తుంది. అరటిపండులో పొటాషియం ఉండే మినరల్ అధిక మోతాదులో ఉంటుంది. మజిల్స్‌ను రిలాక్స్ చేయడంతో పాటు ఈ పొటాషియం గాఢ నిద్రదశలో ఎక్కువ సేపు ఉండడానికి సహాయపడుతుంది. నిద్రలో ఐదు దశలు ఉంటుంది. 
 
నిద్రలో ఒకటి రెండు తేలికపాటి దశలు, మూడు, నాలుగు గాఢనిద్ర, ఐదవ దశ ర్యాపిడ్ ఐ మూమెంట్ దశ. నిద్రలో గాఢమైన దశ, నాలుగు, ఐదు మంచిది. అరటిపండు గాఢనిద్రలోకి వెళ్ళడానికి సహాయపడుతుంది. నిద్రపోవడానికి పదినిమిషాల ముందు అరటిపండు తినాలి.
 
ఇంకా కొన్ని రకాలైన చేపలు, బీన్స్, పెరుగు, ఆకు కూరలను ఆహారంతో కలిపి తీసుకోవడం ద్వారా మంచిగా నిద్ర వచ్చేస్తుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. బీన్స్ వగైరాలలో ముఖ్యంగా బఠానీలు, చిక్కుడు కాయల్లో బి6, బి12 విటమిన్లు ఉంటాయి. అలాగే ఫోలిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు నిద్రొచ్చేలా పనిచేస్తాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారికి బి విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఫాట్‌లెస్ పెరుగులో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఈ రెండు నిద్ర వచ్చేలా చేయడంలో పనిచేస్తాయి. పెరుగులోని కాల్షియం, మెగ్నీషియంల ప్రభావంతో అత్యంత వేగంగా నిద్రలోకి జారుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆకుకూరల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు ఆకుకూరలను రెండు రోజులకోసారి ఆహారంతో కలిపి తీసుకోవాలి.