బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 25 మే 2017 (19:17 IST)

ఆపిల్ కంటే ఎన్నో రెట్లు మేలు చేసే పండు ఏమిటో తెలుసా?

జామపండు ఆపిల్ పండు కంటే ఎన్నో రెట్లు మేలు చేస్తుంది. దాని ప్రయోజనాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. 1. జామ పండులో విటమిన్ ఎ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే దీన్ని తీసుకునేవారిలో కంటిచూపు సమస్యలు వుండవు. క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ తదితర కంటి సమస్యలను ఇది న

జామపండు ఆపిల్ పండు కంటే ఎన్నో రెట్లు మేలు చేస్తుంది. దాని ప్రయోజనాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.
1. జామ పండులో విటమిన్ ఎ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే దీన్ని తీసుకునేవారిలో కంటిచూపు సమస్యలు వుండవు. క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ తదితర కంటి సమస్యలను ఇది నిరోధిస్తుంది. 
 
2. జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ల నివారణకు జామ బాగా వుపయోగపడుతుంది. జామలోని యాంటి ఆక్సిడెంట్స్ ఇందుకు దోహదం చేస్తాయి. 
 
3. క్రమం తప్పకుండా జామపండు తినేవారిలో బరువు నియంత్రణలో వుంటుంది. పీచు పదార్థాలు ఎక్కువగా వుంటాయి. అలాగే చక్కెర పాళ్లు తక్కువగా వుంటాయి. అందుకే ఇది స్వాభావికంగా బరువు నియంత్రించడానికి ఇది బాగా వుపయోగపడుతుంది.
 
4. జామపండులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. కనుక విటమిన్ సి లోపం కారణంగా వచ్చే స్కర్వీ వంటి వ్యాధులకు విరుగుడుగా ఇది పనిచేస్తుంది. 
 
5. థైరాయిడ్ వ్యాధులకు నియంత్రణకు ఉపయోగపడే జామపండును క్రమంతప్పకుండా తినేవారికి మెదడు కూడా చురుగ్గా వుంటుంది. ఇంకా రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి జామ సహాయపడుతుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. 
 
6. జామపండ్లను కొరికి తినేవారిలో చిగుర్లు, పంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా వుంటాయి.