ఈతరం అమ్మాయిలు ఖచ్చితంగా కరివేపాకు పచ్చడి తినాల్సిందే (video)
ఈ తరం అమ్మాయిల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కరివేపాకు పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆకలిలేమి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలను అడ్డుకోవాలంటే ఆహారంలో కరివేపాకు తప్పకుండా వాడాలి.
కరివేపాకులో మహిళలకు కీలకంగా ఉపయోగపడే ల్యూటిన్, ఫోలిక్‌యాసిడ్, ఇనుము, క్యాల్షియం, నియాసిన్, బీటాకెరటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రుతుక్రమ సమస్యలను అడ్డుకోగలవు. దీనితోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
కరివేపాకును పచ్చడి లేదా పొడి రూపంలో తీసుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమిని తొలగించుకుంటే బరువు తగ్గడం కూడా సులభం అవుతుంది. కరివేపాకు క్యాల్షియం, ఇనుము సమపాళ్లల్లో శరీరానికి అందుతాయి. ఫలితంగా నెలసరి క్రమబద్ధం అవుతుంది. రక్తంలోని చక్కెరస్థాయులూ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.