బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 జనవరి 2020 (20:07 IST)

ప్రతిరోజూ ఓ పండును తినాలి, ఈ రసం తాగితే?

ప్రతిరోజూ ఏదో ఒక పండును ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే అధిక రక్తపోటు వున్నవారు బీట్ రూట్ రసం తాగితే అదుపులోకి వస్తుందనేది వైద్యుల సలహా. ఈ బీట్ రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు అదుపులో వుండటంతో పాటు నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ తోడ్పడుతుంది. 
 
2. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
 
3. విటమిన్‌ బి ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడిబారకుండా చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. 
 
4. బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చని వైద్యులు చెపుతున్నారు.