1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Health Benefits of Fenugreek Leaves juice with honey

మెంతి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే?

Fenugreek leaves benefits for diabetes
మెంతులే కాదు మెంతి ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణాశయ సంబంద సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకుల రసానికి ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
 
కామెర్లు వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే త్వరగా కోలుకుంటారు. 
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకుల రసం రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
 
మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఫలితం కనిపిస్తుంది.
 
‌మెంతి ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
 
మెంతి‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
 
తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖం మీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట రాయాలి.
 
ఇలా అప్లై చేసింది రాత్రంతా వుంచి తెల్లారగానే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు సమస్య నుంచి విముక్తి అవ్వచ్చు.
తర్వాతి కథనం
బీన్స్ తింటే ఇన్ని ప్రయోజనాలు వున్నాయా?