బీన్స్ తింటే ఇన్ని ప్రయోజనాలు వున్నాయా?
బీన్స్‌లో లుటిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి బీన్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
బీన్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బీన్స్ శరీరానికి 31 కేలరీల శక్తిని అందిస్తాయి.
గ్రీన్ బీన్స్‌లో విటమిన్లు, మినరల్స్, సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
బీన్స్‌లో ఉండే పీచు పెద్దప్రేగు నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది.
బీన్స్‌లోని పోషకాలు కంటి రెటీనాను యూవీ కిరణాల నుండి రక్షిస్తుంది.
ఆకుపచ్చ బీన్స్ తినడం ఋతుస్రావం, గర్భధారణ సమయంలో నాడీ గొట్టాలను రక్షించడంలో సహాయపడుతుంది.
బీన్స్ హృదయ స్పందన రేటు, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.