బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (17:13 IST)

అధిక బరువు తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన అల్పాహారం

brown-banana
శరీరంలో చేరిన కొవ్వును తగ్గించుకునేందుకు చాలామంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే ఉదయం తీసుకునే అల్పాహారంలో కాస్త మార్పులు చేసుకుంటే బరువు ఇట్టే తగ్గవచ్చని చెపుతున్నారు పోషకాహార నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
 
బరువు తగ్గడానికి ఉపయోగపడే అల్పాహారాల్లో కోడిగుడ్లు వుంటాయి. వీటిని అల్పాహారంతో తింటే ఆకలిని తగ్గిస్తుంది.
 
గోధుమలు వంటి తృణధాన్యాల ద్వారా ఫైబర్ తీసుకోవడం పెంచడం వల్ల బరువు తగ్గవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 
అరటిపండ్లు, కూరగాయలు వంటి పండ్ల నుండి పీచుపదార్థాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం పెరుగుతుంది.
 
బెర్రీ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఆకలిని తగ్గించి ఆహారం తీసుకోవడం తగ్గిస్తుంది.
 
ద్రాక్షపండ్లు బరువు తగ్గించే జాబితా పండ్లలో వున్నాయి. వీటిని కూడా అల్పాహారంతో కలిపి తీసుకోవచ్చు.
 
విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం అధికంగా ఉన్న కివీస్ పండ్లను తీసుకుంటుంటే బరువు కంట్రోల్ అవుతుంది.
 
గ్రీన్ టీకి దాని జీవక్రియ, కొవ్వును కరిగించే సామర్థ్యాలున్నాయి కనుక ఉదయాన్నే దీన్ని తీసుకోవచ్చు.
 
పిస్తా, బాదములు వంటి ఫైబర్, ప్రోటీన్, గుండె-ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క సంపూర్ణ సమతుల్యతను అందిస్తాయి. కనుక వీటిని తీసుకోవచ్చు.