శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (21:12 IST)

రక్త హీనతను అధిగమించేందుకు తాగాల్సిన రసాలు

రక్తహీనత వంటి వ్యాధిని ఎదుర్కొంటున్నట్లయితే, వెంటనే ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ఈ జ్యూస్‌లలో దేనినైనా క్రమం తప్పకుండా తీసుకుంటుంటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
బీట్‌రూట్ రసం శరీరంలో రక్త స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.
 
బచ్చలికూర, పుదీనా రసం శరీరంలో రక్త కొరతను తీర్చడానికి మంచి ఎంపిక.
 
దానిమ్మ రసం కూడా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇందులో తగినంత విటమిన్ సి ఉంటుంది.
 
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
 
నేరేడు కాయ, ఉసిరి రసాలను తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
 
క్యారెట్, పాలకూర రసం తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.
 
పుచ్చకాయ రసం త్రాగండి, ఇది శరీరంలో రక్త కొరతను తీరుస్తుంది.