శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2016 (17:13 IST)

తేనెలో నానబెట్టిన ఉసిరికాయ ఆరగిస్తే...

తేనెలో ఊరించిన ఉసిరికాయను ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, కామెర్లను పూర్తిగా నివారిస్తుంది. దీంతో పాటు.. శరీరంలో, కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్, చెడు ఆమ్లాలను త

తేనెలో ఊరించిన ఉసిరికాయను ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, కామెర్లను పూర్తిగా నివారిస్తుంది. దీంతో పాటు.. శరీరంలో, కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్, చెడు ఆమ్లాలను తొలగిస్తుంది. దాంతో కాలేయం మరింత చురుకుగా పనిచేస్తుంది. 
 
తేనెలో ఊరించిన ఉసిరికాయ అజీర్తి, ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు. అంతేకాదు ఇది ఆకలిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలో ఊరిన ఉసిరికాయ ద్రవాన్ని త్రాగడం వల్ల మలబద్దకం నుంచి పైల్స్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.