ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By kiranbindu
Last Modified: బుధవారం, 3 మే 2017 (18:01 IST)

కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పాలకూర తింటే ఏమిటి?

కొత్తిమీర: చక్కని సువాసన, కమ్మని రుచి కొత్తిమీర సొంతం. దీన్ని తరచూ తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరుకు ఉపయోగపడుతుంది, మధుమేహంతో బాధపడేవారికి ఔషదంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లూ, యాంటీ యాక్సిడెంట్లూ కొవ్వును

కొత్తిమీర:  చక్కని సువాసన, కమ్మని రుచి కొత్తిమీర సొంతం. దీన్ని తరచూ తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరుకు ఉపయోగపడుతుంది, మధుమేహంతో బాధపడేవారికి ఔషదంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లూ, యాంటీ యాక్సిడెంట్లూ కొవ్వును కరిగిస్తాయి, కీళ్లనొప్పులను తగ్గిస్తాయి, నోటిపూతను అదుపులో ఉంచుతాయి, నెలసరి ఇబ్బందులు తగ్గుతాయి.
 
కరివేపాకు: తాజా కరివేపాకును కొబ్బరినూనెలో వేసి మరిగించి క్రమం తప్పకుండా తలకు పట్టిస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. కరివేపాకులోని విటమిన్ ఎ, సి కాలేయం చక్కగా పనిచేస్తుంది, పొడి దగ్గు, అజీర్తి సమస్యలతో బాధపడేవారికి కరివేపాకు బాగా దోహదపడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్లు కరివేపాకును ఎక్కువగా తీసుకుంటే మంచిది, కొవ్వు పేరుకోకుండా ఉండటంలో కరివేపాకు ఉపయోగపడుతుంది.
 
పుదీనా: పుదీనాలో ఉండే వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, బి దొరుకుతాయి, దీనిలోని యాంటియాక్సిడెంట్లూ ఫైటోన్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి, వీటివలన జీర్ణవ్యవస్థ పనితీరు పెరుగుతుంది. దీనిలోని పోషకాలు కండరాలను ఉత్తేజితం చేస్తాయి, ఒళ్లు నొప్పులు దూరమవుతాయి. కడుపుబ్బరంతో బాధపడేవాళ్లు భోజనానంతరం గ్లాసు నీళ్లలో పుదీనా ఆకులు వేసి మరిగించి గోరువెచ్చగా అయ్యాక వడగట్టి తీసుకోవాలి. గ్లాసుడు నీళ్లలో కొంచెం పుదీనా ఆకులు వేసి గదిలో ఉంచితే మంచి సువాసన వస్తుంది.
 
పాలకూర: పాలకూరలో ఉండే విటమిన్‌ ఎ, సి క్యాన్సర్‌ను నిరోధించడంలో, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను అదుపు చేయడంలో సహాయపడతాయి, గుండె జబ్బుల సమస్యలు ఉండవు. ఐరన్ ఎక్కువగా ఉన్న పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే స్త్రీల సౌందర్యానికి ఎంతగానో తోడ్పడుతుంది.