Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగ ఆకు రసంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తెలుసుకోవాల్సిందే

Written By సిహెచ్
Updated: శనివారం, 1 ఆగస్టు 2020 (23:13 IST)
మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి గట్టిగా మూతపెట్టి 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి పాత్రలోని మునగాకు తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాలపొడి తగినంత ఉప్పు, 1 చెంచా నిమ్మరసం వేసి ప్రతిరోజూ ఉదయం సేవిస్తూ ఉంటే అజీర్తి, ఉబ్బసం, రక్తహీనత, మామూలు జలుబు, దగ్గు, నిస్సత్తువ వంటివి దరిచేరవు.
 
ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ప్రతిరోజూ పిల్లలకు తినిపిస్తుంటే పిల్లలు మంచి ఆరోగ్యముగా ఉండి చిన్నచిన్న వ్యాధులను లెక్కచేయకుండా చక్కగా ఆడుకుంటారు. వారి ఎముకలు గట్టిపడి పెరుగుదల బాగా ఉంటుంది.
 
ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటినుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక సుఖప్రసవం అవుతుంది.
 
బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్‌తో కలుపుకుని తాగితే మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్రపిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతుంది.
 
ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుతూ వున్నట్లయితే రేచీకటి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధముగా పనిచేస్తుంది.
 
మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరినీటిలో ఒక చెంచా రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగుతాయి.

అన్నీ చూడండి

ఆరు నెలల్లో రూ.45 లక్షల అప్పు తీర్చేసిన యువతి.. ఎలా సాధ్యం?

యువతులు జీన్స్ ధరిస్తే యువకులు హద్దులు దాటుతారా? ఢిల్లీ హైకోర్టు

17 యేళ్ల బాలికను గర్భవతిని చేసిన 17 యేళ్ల బాలుడు

ఆగష్టు 11, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?

అమావాస్య రోజున ఆకాశంలో అరుదైన కలయిక.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు

అన్నీ చూడండి

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

జ్యోతి పూర్వజ్ కిల్లర్ చిత్రం తెలుగు, తమిళ సహా పలు దేశాల్లో విడుదల.

Manchu Manoj :ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు : గజ టీజర్ లాంచ్ లో మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments