శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (16:33 IST)

తమలపాకును వేడి చేసి అక్కడ పెట్టుకుంటే..?

తమలపాకు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కానీ దీనిని ఎక్కువగా తీసుకుంటే రోగాలబారిన పడతారంటున్నారు వైద్యులు. ఇందులో ప్రముఖంగా దంతదౌర్బల్యం, రక్తహీనత(ఎనీమియా), కంటి జబ్బులు, ముఖానికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు వైద్యులు.
 
1. తమలపాకును భోజనం చేసిన తరువాత తీసుకుంటే నోరు శుభ్రమౌతుంది. ఇది జీర్ణక్రియకు చాలా బాగా తోడ్పడుతుంది. కాని కొంతమంది దీనిని నిత్యం వాడుతుంటారు. ఇది మంచిదికాదంటున్నారు వైద్యులు. 
 
2. తమలాపాకును వేసుకునేవారు తమ శరీరంలోని అలసటను దూరంచేసుకుంటుంటారు. దీనిని కొంతమంది అలవాటుగా చేసుకుని బానిసైపోతుంటారు. దీంతో అనారోగ్యంబారిన పడుతుంటారని వైద్యులు సూచిస్తున్నారు.
 
3. పులిపిరులున్నవారు తమలపాకు కాడను సున్నంలో కలిపి ఒక వారంపాటు ఆ పులిపిరులపై పూయండి. దీంతో పులిపిరులు రాలిపోతాయి. 
 
4. దెబ్బలు తగిలి వాపు, రక్తం గడ్డ కట్టడం లాంటివి జరిగినప్పుడు తమలపాకును వేడి చేసి వాపు లేదా రక్తం గడ్డ కట్టిన ప్రాంతంలో కట్టులాగా కడితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 
5. దగ్గు, కఫం, శ్వాస సంబంధిత వ్యాధులకు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.