శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (15:51 IST)

నడక వ్యాయామం... ఇలా చేస్తే మంచి ఫలితాలు...

వ్యాయామాలన్నింటిలోకి నడక వ్యాయామం ఉత్తమమైనది. ఈ వ్యాయామ చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట నుండి గంటసేపు నడవాలి. నడిచేటప్పుడు తప్పనిసరిగా షూ వేసుకోవాలి. నడక మొదలుపెట్టే ముందు కనీసం 10 నుండి 12 నిమిషాలు వార్మప్ (శరీరానికి చురుకుపుట్టించే వ్యాయామాలు, కాళ్ళుచేతులను సాగదీయటం) చేయాలి. ఆ తరువాత వేగంగా నడవాలి. 
 
ఎత్తయిన ప్రాంతానికి ఎక్కుతూ 3 నిమిషాల తరువాత చదును ప్రాంతం మీద 2 నిమిషాలు మళ్ళీ ఎత్తయిన ప్రాంతం మీద ఇలా మార్చి మార్చి నడిస్తే మంచి ఫలితాలు కనబడతాయి. మొదట్లో తక్కువ దూరం వెళ్ళినా ఆ తరువాత వేగం, దూరం పెంచుకుంటూ వెళ్ళాలి. వాకింగ్ చేసేటప్పుడు పండ్లు, కొబ్బరినీళ్ళు త్రాగితే మంచిది. అధిక బరువు తగ్గుతారు. 
 
గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే మంచిది. మొదట్లో గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే చాలు. నడిచేటప్పుడు దూరం, సమయం దృష్టిలో ఉంచుకోవటం ముఖ్యం. ఇలా నడక వ్యాయామం చేస్తే.. ఒత్తిడిగా ఉన్నప్పుడు కాస్త రిలాక్స్‌గా అనిపిస్తుంది. అంతేకాదు.. శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కూడా తొలగిపోతుంది.