సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (12:20 IST)

చేతి వేళ్లతో వ్యాయామం ఎలా చేయాలో తెలుసా..?

కంప్యూటర్ ఉద్యోగాలు. ఎప్పుడు చూసినా కీబోర్డు మీద టైప్ చేస్తుంటాం. స్టీరింగ్ తిప్పుతూ కారులో షికారు చేస్తాం. ఇలా చేతి వేళ్లతో రోజూ ఎన్నెన్నో పనులు చేస్తుంటారు. ఒకేరకం కదలికతో కూడిన ఇలాంటి పనులతో చేతి వేళ్లు అలసిపోవచ్చు. కీళ్లు బిగుసుకుపోవచ్చు. దాంతో కండరాలు బలహీనంగా మారి చేతి బిగువు తగ్గిపోవచ్చు..


ఇలాంటి పనులు చేయడం వలన చేతి వేళ్లు పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యల నుండి ఉండి ఉపశమనం పొందాలంటే.. చేతి వేళ్లతో వ్యాయామం చేయాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు రావు.. మరి ఆ వ్యాయామం ఎలా చేయాలో తెలుసుకుందాం..
 
వేళ్లు సాగదీత:
అరచేయిని టేబుల్ మీద ఆనించాలి. ఇప్పుడు చేతి మధ్యభాగం టేబుల్‌కు తాకకుండా కాస్తే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దాంతో నెమ్మదిగా వేళ్లను ముందుకు సాగదీయాలి. కాసేపు అలానే ఉంచి, తిరిగి యథాస్థితికి రావాలి. 
 
పిడికిలి బిగింపు:
మిగిలిన వేళ్ల మీదుగా బొటనవేలును పోనిస్తూ పిడికిలి బిగించాలి. పిడికిలిని కాసేపు అలానే గట్టిగా పట్టి ఉంచాలి. ఆ తరువాత వేళ్లను వీలైనంత వెడల్పుగా సాగదీయాలి.  
 
పంజా బిగింపు:
అరచేయిని మీవైపు తిప్పుకోవాలి. పంజా మాదిరిగా మెుదళ్లను తాకేలా అన్ని వేళ్లనూ వంచాలి. కొన్ని సెంకడ్ల పాటు అలా పెట్టి ఉంచి, వేళ్లను వదులుగా చేయాలి. 
 
వేళ్లు లేపడం:
అరచేతిని పూర్తిగా ఆనేలా టేబుల్ మీద ఉంచాలి. ఇప్పుడూ వరుసగా ఒక్కో వేలిని పైకి లేపి, కిందికి తేవాలి. అన్ని వేళ్లనూ ఒకేసారి పైకి లేపొచ్చు కూడా.. ఇలా ఒక్కో చేయితో 8-12 సార్లు వ్యాయామం చేయాలి.
 
పట్టు బలోపేతం:
సాఫ్ట్ బాల్‌ను అరచేతిలో పట్టుకుని, వీలైనంతవరకూ గట్టిగా నొక్కాలి. కాసేపు గట్టిగా పట్టుకుని వదిలేయాలి. ఒక్కో చేతితో 10-15 సార్ల చొప్పున వారానికి 2-3 సార్లు చేయాలి. బొటనవేలి కీలు దెబ్బతింటే మాత్రం ఈ వ్యాయామం చేయకూడదు.
 
బొటనవేలి సాగదీత:
అరచేతిని టేబుల్ మీద ఆనించి, వేళ్ల మెుదళ్ల వద్ద రబ్బరు బ్యాండును చుట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా బొటనవేలిని మిగిలిన వేళ్ల నుండి దూరంగా జరపాలి. కాసేపు అలానే ఉంచి తిరిగి యథాస్థితికి తేవాలి. ఇళా 10-15 సార్ల చొప్పున వారానికి 2-3 సార్లు చేయాలి. ఒకరోజు దీన్ని చేశాక మధ్యలో 48 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి.