ఏ రంగు గుడ్డు మంచిది.. తెలుపు లేదా గోధుమ వర్ణం గుడ్డా?
శరీరానికి కావాల్సిన పోషకాలను అందించేది గుడ్డు. పేదవాడికి ఇది మాంసంతో సమానం. ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కోడిగుడ్లలో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది.
అయితే, ఈ గుడ్లు రెండు రంగుల్లో కనిపిస్తుంటాయి. ఒకటి తెల్ల గుడ్డు కాదా. మరొకటి గోధుమ రంగులో ఉండే గుడ్డు. నాటు కోడి పెట్టిన గుడ్డు గోధుమ వర్ణంలోనూ బాయిలర్ కోడి పెట్టిన గుడ్డు తెలుపు రంగులో ఉంటుంది. మరి కోడిగుడ్లలో ఈ తేడాలెందుకు..? ఎలాంటి రంగు ఉన్న కోడిగుడ్లను తింటే ఎలాంటి లాభం కలుగుతుందో పరిశీలిద్ధాం.
* సాధారణంగా కోడిగుడ్లు తెలుపు రంగులోనే ఉంటాయి. అయితే వాటికి పెట్టే తిండి కారణంగా గుడ్ల రంగు మారుతుంది. ఎక్కువగా మొక్కజొన్న సంబంధిత ఆహారం పెడితే కోళ్లు పెట్టే గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. అందుకే ఆ గుడ్లలో ఉండే పచ్చసొన కూడా బాగా చిక్కగా ఉంటుంది. రుచి విషయానికి వస్తే తెలుపు కన్నా గోధుమ రంగు గుడ్లే ఎక్కువ రుచిగా ఉంటాయి.
* ఇక పోషకాల విషయానికి వస్తే గోధుమ రంగు గుడ్లలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ గుడ్లలో కన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గోధుమ రంగు గుడ్లలో ఉంటాయి. కనుక తెలుపు రంగు గుడ్ల కన్నా గోధుమ రంగు గుడ్లే బెటర్.