లవంగం పేస్ట్‌ను కంటిపై ఇలా చేస్తే..?

Last Updated: గురువారం, 27 డిశెంబరు 2018 (12:58 IST)
కనురెప్పల మీద వచ్చే చిన్న చిన్న కురుపులు ఇబ్బందిపెడతుంటాయి. బ్యాక్టీరియా చేరడంవలన గాని, కనురెప్పలమీదున్న తైలగ్రంధి నాళం మూత పడటం వలన గాని అలా కురుపు వచ్చినప్పుడు దానిమీద వేడి కాపడం పెట్టాలి. వేడి చేసిన గుడ్డను ఆ కురుపు మీద రోజులో నాలుగైదుసార్లు పెట్టాలి. ఒక చెంచా ధనియాలను ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.

ఆరోగ్యం చిట్కాలు:
1. టీ బ్యాగ్‌ని వేడినీటిలో ముంచితీసి దానిని కంటి కురుపుమీద 8-10 నిమిషాలు ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా తగ్గేవరకూ చేయాలి.

2. ఒక చెంచా ఉప్పును ఒక కప్పు నీటిలో వేసి ఆ నీరు అరకప్పు అయ్యేవరకు మరిగించి, చల్లార్చి, వడకట్టిన నీటిని కంటిలో రోజుకు మూడుసార్లు చుక్కలుగా వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

3. గుజ్జు చేసి గుడ్డమీద పరిచి ఆ ముద్దలోపల ఉన్న గుజ్జుతో కురుపు మీద తుడవాలి.

4. ఆముదం చేతివేలు మీద తీసుకుని ఆ కురుపు మీద పలుమార్లు రుద్దితే కురుపు తగ్గుతుంది. జామ ఆకును వేడిచేసి ఆ వేడి ఆకును గుడ్డలో ఉంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి.

5. లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టుకోవాలి.దీనిపై మరింత చదవండి :