సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 27 డిశెంబరు 2018 (11:26 IST)

గురువారం నిమ్మకాయను, లవంగాలను ఆంజనేయునికి సమర్పిస్తే?

గురువారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపారం బాగా జరుగకపోతే ఒక నిమ్మకాయ తీసుకొని షాప్ లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తరువాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళుతుందని నమ్మకం.
 
మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మచెట్ట ఉండటం ద్వారా ఎలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మచెట్టు ఉండటం వల్ల వాస్తు సమస్యలు తొలగిపోతాయి. 
 
ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకొని కింద నుంచి పైవరకు చూస్తూ దిష్టి తీసి దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెను తిరిగి చూడకూడదు. ఇలా చేస్తే దిష్టి పోతుంది. గురువారం ఇవన్నీ ఖచ్చితంగా మంచి ఫలితాన్నిస్తాయి. కుటుంబ సమస్యలు ఏవున్నా ఉంటే నిమ్మకాయ, లవంగాలను పూజ గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.