శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (17:16 IST)

చింతపండుతో ఆ పాత్రలను శుభ్రం చేస్తే..?

సాధారణంగా ప్రతీ ఇంట్లో పూజ పాత్రలు తప్పకుండా ఉంటాయి. ఈ పాత్రలు పూజ గదినే అద్భుతమైన మందిరంగా చేస్తాయి. కానీ, వాటిని ఎవ్వరూ అంతగా పట్టించుకోరు, శుభ్రం చేయరు. ఒకవేళ శుభ్రం చేసినా కూడా ఏదో చేయాలని చేస్తుంటారు.. తప్ప పరిపూర్ణంగా చేయరు. దాంతో ఆ పాత్రలు తుప్పుపట్టిపోయుంటాయి. కొందరికైతే వీటిని ఎలా శుభ్రం చేయాలో కూడా తెలియదు.. అందుకే.. ఈ చిట్కాలు..
 
1. పాత్రలను శుభ్రం చేసేటప్పుడు నిమ్మ తొక్కలతో బాగా రుద్దాలి.. ఇలా చేసినప్పుడు వాటిలో ఉన్న దుమ్ము, ధూళి అంతా పోతుంది. ఆ తరువాత మీరు క్రమంగా వాడే సబ్బు ఉపయోగించి కడుక్కోవచ్చు..
 
2. చింతపండు వంటకాల్లో ఎక్కువగా వాడుతాం.. మరి దీనితో ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం.. కొద్దిగా చింతపండును తీసుకుని.. మనం తిన్న గిన్నెలు ఎలా కడుగుతామో.. అదే విధంగా పూజ పాత్రలను కూడా చింతపండుతో కడగాలి. ఆ తరువాత సబ్బు వాడాలి. ఇలా చేస్తే.. పూజ పాత్రలు కొత్త వాటిలా తళతళలాడుతాయి. 
 
3. వంటసోడా వంటింట్లో తప్పక ఉంటుంది. కాబట్టి పూజ పాత్రలు శుభ్రం చేసేటప్పుడు.. వంటసోడాలో నిమ్మ చెక్కను అద్ది పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక్కో చెక్కతో పూజ పాత్రలను తోమాలి. ఇలా చేస్తే వాటిలో గల మురికి అంతా పోతుంది.  
 
4. ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు  పాత్రలను శుభ్రంగా కడుక్కునే పూజలు చేయాలి.. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది. రోజూ చేయలేకపోయిన కనీసం వారానికి రెండు లేదా ఒక్కసారైనా కడుక్కోవాలి..