సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:05 IST)

అప్పుడేమో హనుమాన్ దళితుడు.... ఇప్పుడేమో హనుమాన్... ముస్లిం..

హనుమాన్ ఓ దళితుడంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. అంజనీపుత్రునిపై ఓ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. అదే యూపీకి చెందిన బీజేపీ నేత హనుమాన్ ఓ ముస్లిం అంటూ వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ ముస్లిం అని తాను బలంగా నమ్ముతున్నానని బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాజ్ అన్నారు. 
 
అలా చెప్పేందుకు కారణాలు లేకపోలేదని.. ముస్లిం మతస్థుల పేర్లన్నీ దాదాపుగా హనుమాన్‌కు దగ్గరగా వుంటాయని తెలిపారు. ఇందుకు ఉదాహరణగా సులేమాన్, జీషాన్ ఫర్మాన్, రెహ్మాన్ అనే పేర్లను ఎత్తి చూపారు. ఈ పేర్లు హనుమాన్ నుంచి పుట్టినవేనని చెప్పారు. 
 
కాగా, గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమాన్ దళితుడని చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దళితులు ఇక హనుమంతుని ఆలయంలో తామే పూజారులుగా వుంటామని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.