బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (11:34 IST)

బ్రహ్మణుడని చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. శోభనం అయ్యాక నిజం చెప్పాడు...

కట్టుకున్న భర్త చేతిలో భార్య మోసపోయింది. తాను బ్రహ్మణ కులానికి చెందిన వ్యక్తినని నమ్మించి పెళ్ళి చేసుకున్నాడు. తీరా శోభనం ముగిసిన తర్వాత తాను బ్రహ్మణుడు కాదనే నిజం భార్యకు చెప్పాడు. దీంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బేచ్‌రాజి తాలూకా అడివాడ గ్రామానికి చెందిన ఎక్తాపటేల్ అనే యువతి గత ఏడాది ఏప్రిల్‌లో ఎంకాం విద్యను పూర్తి చేసింది. తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎక్తాపటేల్ మెహసానా ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో అకౌంటెంట్‌గా చేరింది. 
 
గ్యాస్ డీలరు జ్యోత్స్నా కుమారుడు యష్‌తో ఎక్తాపటేల్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాము కూడా బ్రాహ్మణకులానికి చెందిన వారిమని ఏక్తాను యష్ నమ్మించాడు. 
 
దీంతో ఈ యేడాది ఏప్రిల్ 23వతేదీన ఏక్తాపటేల్, యష్‌లు పెళ్లి చేసుకున్నారు. శోభనం తర్వాత తాము బ్రాహ్మణులం కాదనే నిజాన్ని యష్ తన భార్యకు చెప్పాడు. దీంతో తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని పేర్కొంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.