హనుమంతుడు దళితుడా.. ఐతే.. పూజారులు ఎందుకు..?
హనుమంతుడు దళితుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పూజారులకు ఎసరు పెట్టేలా మారాయి. యోగి చేసిన వ్యాఖ్యల పర్యవసానంతో దళితులు ఆందోళన బాట పట్టారు. హనుమాన్ దళితుడని.. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడంతో ఇటీవల రోడ్లపైకి వచ్చిన దళితులు.. రాష్ట్రంలోని హనుమాన్ ఆలయాల నిర్వహణ వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతటితో ఆగకుండా.. హనుమాన్ ఆలయాల్లోకి.. దళితులను తప్ప ఇతరులను అనుమతించవద్దని పట్టుబడుతున్నారు. తాజాగా ముజఫర్‌నగర్‌లోని హనుమాన్ ఆలయంలోకి ప్రవేశించిన వాల్మీకి క్రాంతి దళ్ సభ్యులు ఆలయ పూజారిపై చేయిచేసుకున్నారు. అనంతరం ఆయన్ని బయటకు గెంటేశారు. దీంతో కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హనుమాన్ ఆలయానికి భద్రత కల్పించారు.