శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 26 సెప్టెంబరు 2019 (21:20 IST)

చింతపండు అధికంగా తీసుకునేవారి ఆరోగ్యం ఎలా వుంటుంది?

మనం తీసుకుని ఆహారం పద్ధతులను అనుసరించి ఆరోగ్యం వుంటుంది. కొన్నిరకాల పదార్థాలను తీసుకుంటే మేలు కలిగితే మరికొన్ని మోతాదుకి మించి తీసుకుంటే దుష్ర్పభావాలు చోటుచేసుకుంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
 
1. చింతపండు అధికంగా తినే వారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది, శరీరము లావై బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడకాన్ని తగు రీతిలో వుండేట్లు చూసుకోవాలి.
 
2. ఆవాలు దురద, శరీర నీరసాన్ని తొలగిస్తుంది.
 
3. కొత్తిమీర శరీరము క్రమపద్ధతిలో వుండేందుకు తోడ్పడుతుంది.
 
4. వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే శరీరానికి శక్తి వస్తుంది. 
 
5. రక్తమును శుభ్రము చేసేందుకు, ఉత్సాహమును కలిగించేందుకు పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది.
 
6. దగ్గు, జలుబు తరిమికొట్టాలంటే మిరియాలు ఉపయోగపడుతాయి. ఇవి గుండెకి చాలా మంచిది. గుండె నొప్పి రాకుండా కాపాడుతాయి.
 
7. అల్లం మన శరీరంలోని జీర్ణాశయాన్ని శుభ్రం చేయడంలో, తల్లి పాలను శుభ్రం చేసే శక్తి కలిగి వుంటుంది.
 
8. నువ్వులు శరీరంలోని ఎముకలకు శక్తిని ఇవ్వగల సామర్థ్యము కలిగి వుంటాయి. తల వెంట్రుకలకు ఇవి చాలా మంచిది. షుగర్ వ్యాధికి కూడా మంచి మందులా పనిచేస్తుంది.
 
9. జీలకర్ర శరీరం మొత్తాన్ని శుభ్రపరచే గుణము కలిగి వున్నది.