సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 నవంబరు 2018 (22:06 IST)

చిటపట చినుకులు పడుతూ వుంటే... స్వీట్ కార్న్ తింటూ వుంటే...

స్వీట్ కార్న్‌ని దాదాపు పిల్లలైన, పెద్దలైన ఇష్టపడని వారుండరు. లేతగా ఉండే స్వీట్ కార్న్‌ని ఇంట్లో ఉడికించుకున్నా, బయట కొనుక్కుని తిన్నా భలేరుచిగా ఉంటుంది. ఇంకా ఇంకా తినాలనిపించే దానివల్ల కలిగే లాభాలపైన ఓ అవగాహన తెచ్చుకుంటే ఇంకా ఇష్టంగా తినొచ్చు. స్వీట్‌కార్న్‌లో కెలొరీలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే డైటరీ పీచు ఎక్కువ. 
 
ఆలస్యంగా జీర్ణమయ్యే సంక్లిష్ట పిండి పదార్థాలను ఎక్కువ మోతాదులో పొందవచ్చు. ముఖ్యంగా సాయంత్రం పూట దీన్ని స్నాక్స్ రూపంలో తీసుకుంటే మంచిది. రక్తంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది. స్వీట్ కార్న్ వల్ల కలగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
1. మూత్ర పిండాల సమస్యల్ని అదుపులో ఉంచే పోషకాలు స్వీట్‌కార్న్‌లో ఉంటాయి. ఈ గింజల్లో విటమిన్‌ 'ఎ'తో పాటూ బీటా కెరొటిన్‌, ల్యూటెన్‌ లాంటి పోషకాలూ ఉంటాయి.
 
2. ఇవి చర్మ సంరక్షణకూ, కంటి ఆరోగ్యానికీ ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫెనోలిక్‌ ఫ్లవనాయిడ్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌కి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.
 
3. స్వీట్‌కార్న్‌ నుంచి థయామిన్‌, నియాసిన్‌, ఫోలేట్‌, రైబోఫ్లేవిన్‌ లాంటి పోషకాలతో పాటూ జింక్‌, మెగ్నీషియం, రాగి, ఇనుము, మ్యాంగనీస్‌ వంటి ఖనిజాల్ని కూడా పొందవచ్చు.
 
4. స్వీట్ కార్న్ జీర్ణక్రియ పనితీరు వేగంగా ఉండటానికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ గింజల్లో ఉండే బీ12, ఫోలిక్‌ యాసిడ్‌ రక్తహీనత సమస్య రాకుండా చూస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దానివల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.