శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (11:52 IST)

స్మార్ట్ ఫోన్లతో ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుందట..

ఉచిత డేటా పుణ్యంతో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా ఎన్నో సమస్యలు ఏర్పడుతాయని ఎన్నో పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. తాజాగా స

ఉచిత డేటా పుణ్యంతో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా ఎన్నో సమస్యలు ఏర్పడుతాయని ఎన్నో పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని అడ్రియన్ వార్డ్ అనే శాస్త్రవేత్త చెప్తున్నారు. స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా స్మార్ట్ ఫోన్ మన మెదడుపై ప్రభావం చూపుతుందని 800 మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
 
స్మార్ట్ ఫోన్ వినియోగం-మెదడు పనితీరుపై నిర్వహించిన పరిశోధనలో.. కొంతమందిని స్మార్ట్‌ ఫోన్‌‌ను తమ వద్దే ఉంచుకొమ్మన్నారు. ఇతరులను పక్క గదిలో ఉంచమని చెప్పారు. అయితే పక్కగదిలో స్మార్ట్ ఫోన్లు పెట్టేసిన వారిలో ఆలోచన తీరు సానుకూలంగా ఉండగా, ఫోన్‌ను పక్కనే పెట్టుకున్న వారిలో ఆలోచన తీరు ప్రతికూలంగా ఉన్నట్లు తేలింది. 
 
కళ్లముందు, జేబులో ఫోన్‌ పెట్టుకున్న వారు స్విచ్ ఆఫ్ చేసినా పదే పదే ఫోన్ గురించే వాళ్లు ఆలోచిస్తూ ఉంటారనే విషయం వెల్లడైంది. ఫోన్ జేబులో, కళ్లముందు పెట్టుకుని.. ఇతర పనులు చేసుకుంటున్నప్పటికీ వారి దృష్టి మాత్రం స్మార్ట్ ఫోన్‌పైనే ఉన్నట్లు తేలిందని చెప్పుకొచ్చారు. అలావారి ఆలోచన ఎల్లప్పుడూ స్మార్ట్ ఫోన్ వైపు మళ్లడంతో ఆలోచనా సామర్థ్యం తగ్గుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.