మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 10 జులై 2016 (11:12 IST)

మద్యం సేవించిన తర్వాత బ్రష్ చేస్తున్నారా? దంతాలు పుచ్చిపోవడం ఖాయం!

చాలామంది యువకులు, పురుషులు.. మద్యం సేవించిన తర్వాత వాసన రాకుండా ఉండేందుకు ఇంటికెళ్లిన వెంటనే బాత్రూంలో దూరి బ్రష్ చేస్తుంటారు. మరికొందరైతే లవంగాలు, పాన్ మసాలా, వక్కపొడి, యాలగలు ఇలా తమకు తోచినవి నోట్లో

చాలామంది యువకులు, పురుషులు.. మద్యం సేవించిన తర్వాత వాసన రాకుండా ఉండేందుకు ఇంటికెళ్లిన వెంటనే బాత్రూంలో దూరి బ్రష్ చేస్తుంటారు. మరికొందరైతే లవంగాలు, పాన్ మసాలా, వక్కపొడి, యాలగలు ఇలా తమకు తోచినవి నోట్లో వేసుకుంటారు. వీటిలో బ్రష్ చేయడం హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
మద్యంలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించిన వెంటనే ఇంటికెళ్లి బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది జరిగితే దంతాలు త్వరగా పుచ్చిపోతాయి. అందువల్లే మద్యం సేవించిన వెంటనే బ్రష్ చేయరాదని నిపుణులు సలహా ఇస్తున్నారు.