సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (20:59 IST)

ఊపిరితిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు దివ్యౌషధం

వర్షాకాలం వచ్చిందంటే చాలామంది శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఇలాంటివారు ఏవేవో మందులు వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకునే కంటే మన ఇంటి వంటగదిలో వుండే పోపుడబ్బాల్లోని ఇంగువను వాడితే సరిపోతుంది. ఇంగువ చేసే మేలు ఏమిటో చూద్దాం.
 
1. పళ్ళు పుచ్చిపోయి వుంటే రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువ ఆ పంటిపై ఉంచితే అందులో ఉన్న క్రిములు మటుమాయం.
 
2. కడుపులో పురుగులు ఉంటే ఇంగువ నీళ్ళలో కలిపి తీసుకుంటే పురుగులు మటుమాయం. 
 
3. ప్రతి రోజు భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
 
4. ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, ఇతర చర్మ వ్యాధులకు ఇంగువ మంచిమందు. కాసింత నీటిలో ఇంగువను రుద్ది ఆ ద్రవాన్ని చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.
 
5. ఊపిరి తిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు ఇంగువ మంచి ఔషధంలా పని చేస్తుంది.
 
6. మలబద్దకం ఉన్నవారు రాత్రి పడుకోబోయే ముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే ఉదయానికల్లా ఫ్రీ... ఒగరుగా ఉంటుందనుకుంటే కాస్త తీయటి సోడా‌లో కలిపి తీసుకుంటే సరి.