బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (23:52 IST)

పసుపు, ఉసిరి పొడి రెండూ సమానంగా కలిపి అర చెంచా పొడి రోజూ తీసుకుంటే?

కృష్ణతులసి ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసి సీసాలో ఉంచుకుని ఏ ఆహారం వండినా దానిలో చిటికెడు పొడి వేసుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే మధుమేహం వ్యాధి రాకుండా ఉంటుంది.
 
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే మన శరీర బరువుని ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకి ఒక గంట వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.
 
మనం తీసుకునే రోజువారి ఆహారంలో తీపి, నూనె పదార్థాల వాడకం వీలయినంతవరకు తగ్గించాలి. పసుపు, అల్లం, వెల్లుల్లి ఆహారంలో ఎక్కువగా వాడాలి. రాత్రి ఒక చెంచా మెంతులు కప్పు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగాలి. భోజనం టేబుల్ పైన కాక క్రింద కూర్చుని తినాలి. 
 
పసుపు, ఉసిరి పొడి రెండూ సమానంగా కలిపి అర చెంచా పొడి రోజూ రెండు పూటలా నీటితో భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. మనం తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి.