గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (06:45 IST)

మధ్యాహ్నం 2 గంటలలోపు తింటే బరువు తగ్గుతారట...

చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల పేరుతో పస్తులుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గరు కదా.. మరింతగా పెరుగుతారట. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా వైద్యనిపుణులు తా

చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల పేరుతో పస్తులుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గరు కదా.. మరింతగా పెరుగుతారట. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా వైద్యనిపుణులు తాజాగా జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
 
ఎలాంటి ఆహారం తీసుకున్నా.. ఎంత ఎక్కువగా తిన్నా... ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 లోపు తినాలట. ఆ తర్వాత ఇక ఏమీ తినకూడదట. దీనివల్ల జీవక్రియల రేటు పెరిగి కొవ్వు ఎక్కువగా కరుగుతుందని, తద్వారా బరువు తగ్గుతారని వారు చెపుతున్నారు. 
 
ఇందుకోసం కొంతమంది స్త్రీపురుషులపై చేసిన అధ్యయనంలో తేలింది. ఇది పరిమిత సంఖ్యలో వ్యక్తులపై చేసిన అధ్యయనమని.. విస్తృత స్థాయిలో చేసి, పరిణామాలను అంచనా వేయాలని వారు చెబుతున్నారు.