శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 జనవరి 2021 (22:24 IST)

దగ్గు, ఆయాసం, జలుబు వదిలించుకునేందుకు సోంపు

సోంపులో ఎన్నో అమూల్యమైన ఔషధ గుణాలున్నాయి. బరువు తగ్గాలనుకునేవారు సోంపును తీసుకుంటే క్రమంగా అధిక బరువు సమస్య వదిలించుకోవచ్చు.
 
రోజుకి రెండుసార్లు 100 మిల్లీ లీటర్లు మరిగే నీటిలో 5 నుంచి 8 గ్రాముల సోంపు గింజల్ని నలగ్గొట్టి స్టౌ ఆఫ్ చేసిన తర్వాత ఐదారునిమిషాల పాటు పొయ్యిపై పెట్టి దించి వడగట్టి అరటీస్పూను తేనె కలిపి కొద్దికొద్దిగా తాగితే బరువు నియంత్రణలోకి వచ్చేస్తుంది.
 
అలాగే దగ్గు, ఆయాసం జలుబు తగ్గేందుకు సోంపు గింజల పొడి 25 గ్రాములు ఆయుర్వేద షాపుల్లో దొరికే అతిమధుర చూర్ణం 50 గ్రాములు, పటికబెల్లం పొడి 75 గ్రాములు కలిపి వుంచుకుని రోజుకి రెండుపూటలా పూటకి అర టీస్పూను పొడిని 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చటి నీటిలో కలిపి సేవిస్తే సమస్య తగ్గిపోతుంది.