శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (19:12 IST)

జాన్వీ కపూర్ చీరకట్టు.. ఫ్యాన్స్ ఫిదా... ధరెంతో తెలుసా? (Video)

jhanvi kapoor
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి హీరోయిన్‌గా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. అమ్మ లేని లోటును ఆమె ఫ్యాన్స్‌కి తెలియనివ్వకూడదని జాన్వీ అనుకుంటోంది. అందుకే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను అప్డేట్ చేస్తూ వుంది. తాజాగా జాన్వి చీరల్లో మెరిసిపోతుంది. ఆమెను చీరలో చూసిన ప్రతిసారీ నెటిజన్లు అతిలోక సుందరి వెర్షన్ 2.0 అని సరదాగా కామెంట్లు కూడా చేస్తుంటారు. 
 
లేటెస్ట్‌గా అలా... అంతకన్నా చిలిపిగా కామెంట్ చేయడానికి తగ్గట్టు ఓ ఫొటో పోస్ట్ చేశారు జాన్వి. అసలే అతిలోక సుందరి తనయ... ఆపై తెల్లటి చీరకట్టు... దాని అంచు మీద ఎంబ్రాయిడరీ. అంతే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. 
 
ఈ చీర ధర లక్ష రూపాయలని టాక్. ఆ చీరలో హుందాగా, అందంగా కనిపిస్తున్నారు జాన్వి. అబ్బాయిలు జాన్విని చూస్తుంటే, అమ్మాయిలు మాత్రం ఆమె స్టైలింగ్‌, శారీ వేరింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక తెలుగులో జాన్వీ ఎంట్రీ ఎప్పడనే దానిపై చర్చ టాక్ జరుగుతోంది. 
 
పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న జాన్వికి బెస్ట్ ఎంట్రీ దొరుకుతుందనే గ్యారంటీగా చెప్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ పక్కన శివ నిర్వాణ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని టాక్ వస్తోంది.