1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. action plan on tirumala seshachalam says prakash javdekar

తిరుమల పరిరక్షణకు ప్రణాళిక - మంత్రి జవదేకర్

Action plan
ఎర్రచందనం స్మగ్లర్లు, వరుస అగ్ని ప్రమాదాల నుంచి తిరుమల క్షేత్రం కొలువున్న శేషాచలం అడవుల పరిరక్షణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
 
దర్శనం అనతరం మీడియాతో మాట్లాడుతూ నిత్యం వేలాదిగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుమల సప్తగిరుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు టీటీడీ, రిజర్వు ఫారెస్ట్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో కూడా తలెత్తే అన్ని సమస్యల్ని టీటీడీ, రిజర్వు ఫారెస్ట్ సంయుక్తంగా కట్టడి చేసేందుకు అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. 
 
About Writer
pyr