1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. baghavdgeetha is guide for humanity

ప్రపంచానికి భగవద్గీత మార్గ దర్శకం : జేఈవో పోలా భాస్కర్

ttd
సమస్త మానవాళికి భగవద్గీత మార్గదర్శకంలాంటిదని తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్ అన్నారు. అటువంటి భగవద్గీతను ప్రతీ ఒక్కరు పారాయణం చేయాలని కోరారు. తిరుపతి గాయకుడు గంగాధర్ రూపొందించిన సంపూర్ణ భగవద్గీత తొలికాపీని అలిపిరి పాదాల మండపం నుంచి కాలి నడక తిరుమలకు తీసుకెళ్ళడాన్ని ప్రారంభించారు. అక్కడ స్వామి పాదపద్మాల వద్ద ఉంచిన తరువాత దానిని తొలి కాపీని విడుదల చేస్తారు. 
 
ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, నిజ జీవితానికి భగవద్గీతలో ఎన్నో మార్గాలు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆయన చెప్పారు. దీనిని రూపొందించడంపై నేపథ్య గాయకుడు, భగవద్గీత పౌండేషన్ అధ్యక్షుడు అయిన గంగాధర్ ను కొనియాడారు.  ఈ సిడీ ప్యాక్ లో 20 సిడిలు ఉంటాయని, వాటిలో 18 చాప్టర్లు, మిగిలిన రెండు సిడీ వివరణలతో కూడినవి ఉంటాయని గంగాధర్ తెలిపారు. 
 
ఈ సిడిలు, డాక్యుమెంటరీ తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సహాసహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి రఘునాథ్, ఎస్వీ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ వైవిఎస్ పద్మావతీ తదితరులు పాల్గొన్నారు. 
About Writer
PYR