శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (21:54 IST)

చంద్రగ్రహణం.. కనకదుర్గమ్మ ఆలయం మూసివేత

మంగళవారం కేతు గ్రస్త చంద్రగ్రహణము సందర్భముగా సాయంత్రం ప్రదోష అర్చన, అమ్మవారి పంచ హారతులు సేవ అనంతరము 06.45 గం.లకు దేవాలయము మూసివేయబడినది.

ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మ, ఐ.ఆర్.ఎస్, వైదిక కమిటీ సభ్యులు ఆర్.శ్రీనివాస శాస్త్రి మరియు అర్చకసిబ్బంది పాల్గొన్నారు. తిరిగి 17న స్నపనాది కార్యక్రమముల అనంతరము ఉదయము 10 గం.లకు అమ్మవారి దర్శనం యధావిదిగా ప్రారంభించబడును.

చంద్రగ్రహణము సందర్భముగా 17 ఉదయము జరుగు అన్ని అంతరాలయ సేవలు (సుప్రభాతము, వస్త్రం సేవ, ఖడ్గామాలార్చన, త్రికాలర్చన) రద్దు చేయబడినవి. ఇతర సేవలు అరగంట ఆలస్యముగా ప్రారంభమగునని ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఒక ప్రకటనలో తెలియజేసినారు.