శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (09:57 IST)

నేడు అరుదైన చంద్రగ్రహణం.. ప్రత్యేకత ఏంటంటే...

దాదాపు 150 సంవత్సరాల తర్వాత గురుపౌర్ణమి రోజున చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించనుంది. నిజానికి ఈ తరహా చంద్రగ్రహణం గత 1870 సంవత్సరం జూలై 12వ తేదీన గురుపౌర్ణమి రోజు ఇదేవిధంగా చంద్రగ్రహణం ఏర్పడింది. ఇపుడు అంటే 150 యేళ్ల తర్వాత మంగళవారం ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 
 
ప్రస్తుతం రాబేయే చంద్రగ్రహణం మంగళవారం రాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో ఏర్పడి, రెండో పాదంలో ముగుస్తుంది. అంటే అర్థరాత్రి 1.30 నిమిషాలకు ధనుస్సు రాశిలో ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం, తెల్లవారుజామున 4.31 నిమిషాలకు మకర రాశిలో ముగుస్తుంది. మొత్తం 178 నిమిషాల పాటు ఉండే ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే మనకు కనిపిస్తుంది. 
 
ఈ సమయంలో రాహువు, శని చంద్రుడితో కలిసి ధనుస్సు రాశిలో ఉంటారు. అయితే ఈ చంద్రగ్రహణం ప్రభావం అది ఏర్పడబోయే నక్షత్రాలు, రాశులను బట్టి ఆయా రాశులు, నక్షత్రాల వారికి అధమ, మధ్యమ, విశేష ఫలితాలను అందిస్తుందని వేదపండితులు చెబుతున్నారు. 
 
దీనిప్రకారం వృషభ, మిథున, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ చంద్ర గ్రహణం అధమ ఫలితాలను కలిగిస్తుంది. అదేవిధంగా తుల, కుంభ రాశులలో జన్మించిన వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఇక మేష, కర్కాటక, వృశ్చిక, సింహ, మీన రాశుల్లో జన్మించిన వారికి విశేషమైన ఫలితాలు ఈ చంద్రగ్రహణం వల్ల కలుతాయని వారు తెలియజేస్తున్నారు. 
 
ఇకపోతే, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినవారు, ధనుస్సు, మకర రాశుల్లో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని చూడకూడదని జ్యోతిష్యులు చెబుతున్నప్పటికీ, గ్రహణ సమయం అర్థరాత్రి 1.30 నుంచి తెల్లవారు జాము 4.30 మధ్యలో కావటం ఆ సమయం అందరూ నిద్రించే సమయం కావటంతో ఈ నక్షత్రాలు, రాశులవారు భయపడాల్సిన అవసరం లేదని కూడా వారు చెబుతున్నారు.