బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (12:18 IST)

16-07-2019- మంగళవారం దినఫలాలు - స్త్రీలు మధ్యవర్తిత్వం వహించడం వల్ల..

మేషం : విద్యార్థులు చంచల స్వభావం విడనాడి కృషిచేసిన సఫలీకృతులవుతారు. కోళ్లు, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. దైవ, దర్శనాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలు మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడక తప్పదు.
 
వృషభం : బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి కలిసివచ్చేకాలం. గృహంలో మార్పులు చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. బంగారం, వెండి రంగాలలో వారికి ఒత్తిడి తప్పదు. ఉద్యోగస్తులకు సదవకాశాలు లభించిన గానీ సద్వినియోగం చేసుకోలేరు.
 
మిథునం : వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, బ్రోకర్లకు పురోభివృద్ధి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కర్కాటకం : విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. పత్రికా రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు.
 
సింహం : రాజకీయాలలో వారికి తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. స్థిర చరాస్తులకు సంబంధిచిన సంప్రదింపులు, వాణిజ్య ఒప్పందాలు కొత్త మలుపు తిరుగుతాయి. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.
 
కన్య : దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
తుల : ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రాబడికి మించిన ఖర్చులున్నా ఇబ్బందులు అంతగా ఉండవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యం అవసరం.
 
వృశ్చికం : ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు నిర్లక్ష్యం వ్లల కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. భాగస్వామిక సమావేశంలో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మొక్కుబడులు చెల్లిస్తారు.
 
ధనస్సు : ఆర్థిక లావదేవీల్లో ఒత్తిడి, హాడవిడి అధికంగా ఉంటాయి. ముఖ్యుల కోసం, మీ ప్రియతముల కోసం ధనం విరివిగా వెచ్చిస్తారు. కొంతమంది మీ మీద నిందారోపణలు చేయడం వల్ల ఆందోళన అధికమవుతుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికం.
 
మకరం : ఆస్థి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక అవగాహనకు వస్తారు. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. మీ విలువైన వస్తువులు ఇతలుకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం : బంధువుల రాకతం గృహంలో సందడి కానవస్తుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒప్పందాలు, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. అసాధ్యమనుకున్న ఒక వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. దూరప్రయాణాల ఆశయం నెరవేరుతుంది.
 
మీనం : దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, చికాకులు చోటు చేసుకుంటాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ఇతరులకు పెద్దమొత్తంలో ధన సాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవటం మంచిది.