శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 15 జులై 2019 (08:48 IST)

15-07-2019- సోమవారం దినఫలాలు

మేషం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారి తత్వాన్ని గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెళుకువ అవసరం. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. 
 
వృషభం: స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం అంతగా ఉండదు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. విదేశీయానం, రుణ యత్నాల్లో చికాకులు తప్పవు. మీ సంతానం విద్యా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది.
 
మిథునం: ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. తలపెట్టిన పనులకు ఆటంకాలు తొలగిపోతాయి.
 
కర్కాటకం: ఆర్థిక సమస్యల వల్ల ఒకింత ఆందోళనకు గురవుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. రాజకీయాలలోని వారు ఆచితూచి వ్యవహరించవలెను. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
సింహం: స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరులకు హమీలు ఉండటం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. నూతన టెండర్లు, ఏజెన్సీలు, వాణిజ్య ఒప్పందాల్లో పునరాలోచన మంచిది. మీ ప్రియతముల పట్ల, ప్రముఖ్యుల పట్ల శ్రద్ద పెరుగుతుంది.
 
కన్య: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకింగ్ అధికారులతో సంభాషిచేటప్పుడు జాగ్రత్త వహించండి.
 
తుల: రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. దంపతులకు ఎడబాటు తప్పదు. క్రయ విక్రయ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతి ఫలం దక్కుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు.
 
వృశ్చికం:  ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
ధనస్సు: సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
మకరం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభాదాయకంగా ఉంటుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమతున్నారని గమనించండి.
 
కుంభం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామికులకు కార్మికుల సహకారం లభించదు. 
 
మీనం: ఉన్నత విద్యలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు.