సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (08:47 IST)

ఆదివారం (14-07-2019) దినఫలాలు - పొదుపు పథకాల దిశగా...

మేషం: ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదం చేస్తాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.
 
వృషభం: పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. సమావేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
 
మిథునం: కర్కాటకం: ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందుతుంది. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడుట వల్ల ఆందోళనకు గురవుతారు. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికంకాగలవు.
 
కర్కాటకం : బంగారు, వెండి, లోహ, వస్త్ర రంగాలలో వారికి మందకొడిగా ఉండగలదు. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. ఇతరులకు విమర్శించుట వలన మాటపడక తప్పదు. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తి. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి.
 
సింహం: హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానరాగలదు. మీ వాక్చాతుర్యానికి, మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. రవాణా రంగాల వారికి ఏకాగ్రత, మెళకువ అవసరం. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కన్య: సృజనాత్మకంగా వ్యవహరించినప్పుడు మాత్రమే లక్ష్య సాధన వీలవుతుందని గ్రహించండి. ఏ విషయమైనా గోప్యంగా ఉంచండి. దూరప్రయాణాలలో అపరిచితులపట్ల మెళకువ అవసరం. విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. సోదరీ సోదరులు మీ యత్నాలకు చేయూతనిస్తారు.
 
తుల: వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. వాతావరణంలో మార్పు రైతులకు ఊరటనిస్తుంది. బందుమిత్రుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. పెద్దల ఆరోగ్య విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ప్రతిష్ఠలకు కొంత  విఘాతం కలిగే అవకాశం ఉంది.
 
వృశ్చికం: భాగస్వామిక వ్యవహారాల్లో కొత్త ప్రతిపాదనలు చోటుచేసుకుంటాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు లభిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. వీలైనంత తక్కువగా మాట్లాడి ఎదుటి వారి నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నించండి.
 
ధనస్సు: ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. స్త్రీలకు ఖరీదైన వస్తు కొనుగోళ్ళలో ఏకాగ్రత అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
మకరం: రావలసిన ధనం అందకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి కానరాదు. సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు లేకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిదికాదు.
 
కుంభం:  వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలు తల, నరాలు, నడుము సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులలో నూతనోత్సహం చోటు చేసుకుంటుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు.
 
మీనం: స్థిరాస్తి అమ్మకంపై ఒత్తడి వల్ల ఆందోళనలకు గురవుతారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత చాలా అవసరం. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ముఖ్యుల వల్ల మీ పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. దూరప్రయాణాల్లో మెళకువ అవసరం.