ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (20:33 IST)

09-07-2019 మంగళవారం దినఫలాలు - కార్తికేయుడిని పూజించినా...

మేషం : విద్యార్థులకు ఇంజనీరింగ్, టెక్నికల్, కంప్యూటర్ సైన్సు కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. వ్యాపారాలు, ఉపాథి పథకాల్లో స్థిరపడటంతో పాటు అనుభవం గడిస్తారు. బ్యాంకు పనులు, ప్రయాణాల్లోజాగ్రత్త. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. స్త్రీలు ఆహార, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.
 
వృషభం : స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. స్థిరబుద్ది లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. గట్టిగా ప్రయత్నిస్తేనే మొండి బాకీలు వసూలు కాగలవు. ఉద్యోగ విరమణ చేసిన వారికి రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి సర్దుబాటు కాగలదు.
 
మిథునం : సామాజిక, పుణ్య కార్యాల్లో పాల్గొటారు. ఆస్తి పంపకాలు, స్థల వివాదాలు మరింత జఠిలమవుతాయి. ముఖ్యమైన వ్యవహరాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. పెద్దలు, కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారాకి నిరుత్సాహం తప్పదు.
 
కర్కాటకం : ఆడంబరాలు, భేషజాలకు పోవటం మంచిది కాదు. దంపతుల మధ్య అవగాహన లోపం. పట్టింపులు అధికం. నిరుద్యోగులకు ఆశాజనం. వ్యవసాయ కూలీలు దొరక్క ఇబ్బందులెదుర్కుంటారు. విద్యార్థినుల ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా మెలగాలి. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి.
 
సింహం : మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలగకుండా జాగ్రత్త వహించండి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఉన్నత విద్యావకాశాలు లభించే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు అధికారులతో సఖ్యత నెలకొంటాయి. కీలక నిర్ణయాలు వాయిదా వేయండి.
 
కన్య : బంధుమిత్రుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీల పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉపాధ్యాయులు తరచూ చర్చలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవసాయ రంగాల వారికి విత్తనాల కొనుగోలులో చికాకులు, ప్రయాసలు తప్పవు. సోదరీ, సోదరుల మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
తుల : శారీరక శ్రమ, ప్రయాసలెదుర్కుంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల ఇబ్బందులు తప్పవు. బంధువులను కలుసుకుంటారు. బ్యాంకు పనులు, వాణిజ్య ఒప్పందాలు, చెల్లింపుల వల్ల మెలకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు స్పందన లభిస్తుంది.
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ప్రయత్నపూర్వకంగా రావలసిన ధనం అందుతుంది. జాయింట్ వెంచర్లు, నూతన కాంట్రాక్టర్లకు అనుకూలం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. స్త్రీలకు టి.వి ఛానెళ్ళ నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
ధనస్సు : వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు. పొదుపు చేయాలనే ప్రయత్నం ఫలించదు. స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. అవసరానికి సహకరించని బంధువుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశంవుంది.
 
మకరం : కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించటం క్షేమదాయకం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇందులెదుర్కొంటారు. రాజకీయాలలోని వారు విరోధులు వేసే పథకాలను త్రిప్పి కొడతారు. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది.
 
కుంభం : కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం సంతృప్తకరంగా ఉండదు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్షాలు సాధిస్తారు.
 
మీనం : భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. ఫాన్సీ, కిళ్ళీ, కిరాణా రంగాలలో వారికి, చిరువ్యాపారులకు అనుకూలం. ముఖ్యమైన కార్యక్రమాలలో మధ్యవర్తిత్వం వహించుట వలన మాటపడవలసివస్తుంది. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి.