సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (19:46 IST)

7-7-2019- ఆదివారం మీ రాశి ఫలితాలు.. మిమ్మిల్ని పొగిడే వారే కానీ?

మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ఓ కార్యక్రమంలో మీ ప్రతిష్ఠకుభంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. తెలివి తేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఖర్చులకు సంబంధించి వ్యూహాలు అమలు చేస్తారు. మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం.
 
వృషభం: ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు భవిష్యత్తులో లభిస్తాయి. ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు మీ సహాయం అర్ధిస్తారు. స్త్రీలు షాపింగ్, విందు వినోదాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. బదిలీలు, మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యన్ని కలిగిస్తాయి. 
 
మిథునం : మిమ్మిల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మెండిగా పూర్తి చేస్తారు. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. హామీలు, చెక్కల జారీల్లో ఏకాగ్రత వహించండి.
 
కర్కాటకం : బంగారు, వెండి, లోహ, వస్త్ర రంగాలలో వారికి మందకొడిగా ఉండగలదు. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. ఇతరులకు విమర్శించుట వలన మాటపడక తప్పదు. సాహిత్య రంగాలలోని వారికి సంతృప్తి. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి.
 
సింహం : ఆర్ధిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. సన్నిహితుల మధ్య దాపరికాలు సరికాదని గ్రహంచాలి. దూరప్రయాణాలు, విద్యా విషయాల్లో చికాకులు తప్పక పోవచ్చు. షేర్లు కొనుగోళ్ళు విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దల సహకారం లోపిస్తుంది. వ్యాపార విస్తరణకు ఇది తగిన సమయం కాదు.
 
కన్య : ఉమ్మడి నిధుల నిర్వహణ విషయంలో ఆచితూచి వ్వవహరించండి. దూరంలో ఉన్న వ్వక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. భాగస్వామి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వినోదాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి.
 
తుల : ఆర్థిక విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. మీ మౌనాన్ని కూడా అపార్ధం చేసుకనే అవకాశం ఉంది. వీలయితే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయండి.
 
వృశ్చికం : ఆర్దిక విషయాలలో సన్నిహితుల నుంచి మొహమాటం ఎదురయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి నిధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ దీక్షాకార్యక్రమంలో పాల్గొంటారు. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారం అవుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. స్త్రీలకు నిరుత్సాహం కానవస్తుంది.
 
ధనస్సు : మిత్రులతో మనసు విప్పి మాట్లాడుకుంటారు. వ్వాపార విస్తరణకు సంబంధించిన అంశాల్లో ప్రతికూలత ఎదురుకావచ్చు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. సామూహిక సేవా కర్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
మకరం : రిప్రజెంటేటివ్లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు. నూతన ఒప్పందాలు వాయిదా వేయండి. బ్రోకర్లు, చిట్‌ఫండ్ వ్వాపారస్తులు, ఏజంట్లకు వ్యాపార రంగాలలో వారికి చికాకులు వంటివి తలెత్తుతాయి. విద్యార్ధులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు.
 
కుంభం : వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలు వస్తాయి. సోదరీ సోదరులు, సన్నిహితులకు సంబంధించి ఖర్చులు అధికం. ముఖ్యల కోసం షాపింగ్‌లు చేస్తారు. ఉద్యోగస్తులు ఊహించని అవరోధాలు తలెత్తుతాయి. కార్యకర్తలకు కలిసివచ్చేకాలం. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు చికాకు కలిగిస్తుంది.
 
మీనం : రావలసిన బాకీలు వసూలవుతాయి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రాకపోవచ్చు. జన సంబంధాలు మెరుగుపడతాయి. మీ సంతానం కోసం, ప్రియతముల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కళలు, సాంస్కృతిక రంగాలు, విద్య, న్యాయరంగాల వారు ఈ రోజు కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు.