బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 6 జులై 2019 (09:31 IST)

06-07-2019 శనివారం దినఫలాలు : వాణిజ్య రంగాల్లో వారికి...

మేషం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు. శస్ర చికిత్స చేయునపుడు వైద్యులకు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక, అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. అందరినీ ఆకర్షించగలుగుతారు. వాణిజ్య రంగాల్లో వారికి ప్రోత్సాహం. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును.
 
వృషభం: స్రీలు షాపింగ్ విషయాలల్లో మెళకువ వహించండి. హామీలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. దూరపు బంధువుల ఆరోగ్య విషయంలో ఆందోళన అధికమవుతుంది. తాపీ పనివారితో చికాకులు ఎదురవుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మిథునం: టెక్నికల్, సాంకేతిక రంగాలలో వారికి లాభదాయకం. కాళ్లు, చేతులకు సంబంధించిన చికాకులు తప్పవు. లాయర్లకు రాణింపు ఇతరుల వివాదాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. క్రయ విక్రయదార్లకు చికాకులు ఏర్పడతాయి.
 
కర్కాటకం : రాజకీయాలలో వారు వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మిమ్మల్ని కొంతమంది సహాయం ఆర్ధిస్తారు. విదేశాల నుండి ఆహ్వానం లభిస్తుంది. స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. కళా రంగంలో వారు విశ్రాంతి పొందగలుగుతారు.
 
సింహం: కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సోదరి, సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
కన్య: బ్యాకింగ్ వ్యవహారాలో మెళకువ వహించండి. బిల్లులు చెల్లించగలుగుతారు. రావలసిన బాకీలు సకాలంలో అందుతాయి. ముఖ్యమైన విషయాల్లో కీలకపాత్ర పోషిస్తారు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపీ పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ప్రకృతి, సౌందర్యాలను చూసి సంతృప్తి చెందుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.
 
తుల: సంఘంలో గొప్ప గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రింటింగ్ రంగాలలో వారు పై అధికారుల చేత మాటపడక తప్పదు. కార్మికులకు, చికాకులు తలెత్తినా నెమ్మదిగా పరిష్కరించుకోగలుగుతారు. కంపెనీలలో పనిచేయువారికి జాగ్రత్త అవసరం. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు లాభదాయకం.
 
వృశ్చికం: విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. కార్మికులకు, పారిశ్రామికులకు పరస్పర అవగాహన కుదురుతుంది. డాక్టర్లకు శుభప్రదంగా ఉండగలదు. కోర్టు వ్యవహారములు వాయిదా పడుట మంచిది. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలలో జయం చేకూరును. విద్య, వైజ్ఞానిక రంగంలో వారికి శుభం చేకూరుతుంది.
 
ధనస్సు: నూతన వ్యక్తుల పరిచయం మీకు సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసివస్తుంది. ఇతర దేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించగలుగుతారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
మకరం: చిన్న తరహా పరిశ్రమలలో వారికి సంతృప్తి. హామీలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్ర్తీలకు విదేశీ వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వతంత్ర్య నిర్ణయాలు చేసుకొనుట వలన శుభం చేకూరగలదు.
 
కుంభం: ఆర్ధిక విషయాల్లో సంతృప్తి కానరాదు. మందులు, ఆల్కహాల్, నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మిక, సేవా కర్యక్రమాల్లో పాల్గొంటారు. తొందరపడి వాగ్దానాలు చేయకండి. పెద్దల ఆరోగ్యంలో వైద్యుని సలహా తప్పదు. ఇతరుల సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వుంటాయి. కిరాణా రంగంలోని వారికి శుభదాయకం. కాంట్రాక్టర్లకు శుభం. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు సంతృప్తి కానరాదు. ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థినుల్లో చురుకుదనం కానవస్తుంది.