ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 8 జులై 2019 (08:44 IST)

08-07-2019 సోమవారం దినఫలాలు : మల్లిఖార్జునుడిని ఆరాధించినా..

మేషం : ఆర్థికలావాదేవీలు బాగా కలిసివస్తాయి. ఆస్పత్రి బిల్లులు, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాల్లో అవాంతరాలు తప్పకపోవచ్చు. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగాపాల్గొంటారు. సహోద్యోగులతో కలిసి సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. పారిశ్రామిక, రాజకీయవర్గాలవారికి అనూహ్యమైన అవకాశాలు. 
 
వృషభం : హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరిని ఆకట్టుకుంటారు. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులను ఎదుర్కుంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు.
 
మిథునం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తకరంగా కొనసాగుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు వ్యాపారులకు లభదాయకం. వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదాపడతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి.
 
కర్కాటకం : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు ఒత్తడి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరం. ఖర్చులు ప్రయోజకరంగా ఉంటాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కొబ్బరి, పూలు, పండ్లు వ్యాపారులకు లాభాదాయకం. ప్లీడర్లు పురోభివృద్ధి పొందుతారు.
 
సింహం : బంధువుల కలయికతో నూతనోత్సాహం కానవస్తుంది. ఉద్యోగ, వ్యాపార విషయంలో ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయాల్లో వారికి మెళకువ అవసరం. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. ఆదర్శప్రాయులైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు.
 
కన్య : ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. దైవదర్శనానికి చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదావకశాలు లభిస్తాయి. రుణాలు పెట్టుబడుల కోసం యత్నిస్తారు. 
 
తుల : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధికమిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. 
 
వృశ్చికం : సొంతంగాగాని, భాగస్వామ్యంగాగాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. పెద్దల ఆరోగ్యంలో ఆకస్మిక ఆందోళన తప్పదు. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. అనుబంధాలలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రయాణాలు, ఖర్చులకు సంబంధించిన వ్యూహాలు అమలు చేస్తారు. 
 
ధసన్సు : శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. సోదరులు మీతో అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం : ఆర్థికస్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు. గృహ నిర్మాణాలు సకాలంలో పూర్తికావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఖర్చులు అధికంగా వెచ్చిస్తారు. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
కుంభం : ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. అనుకున్న పనుల ఒక పట్టాన పూర్తికావు. హామీలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
 
మీనం : కుటుంబంలోని పెద్దల వైఖరి ఆనంద కలిగిస్తుంది. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిదికాదని గమనించండి. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. దైవకార్యక్రమాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు లాభదాయకం. స్త్రీలకు పనివారితో ఒత్తిడి చికాకులు తప్పవు.