ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 10 జులై 2019 (09:01 IST)

10-07-2019- బుధవారం.. అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తారు...

మేషం: ఆర్థిక వ్యవహరాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. ప్రేమికుల మధ్య అవగాహన కుదరరదు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం.
 
వృషభం: సోదరులు మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ఖర్చులు అధికమవుతాయి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. భాగస్వాములతో విభేధాలు తలెత్తే ఆస్కారం ఉంది. స్ర్తీలకు ఉపాథి పథకాల పట్ల ఆశక్తి పెరుగుతుంది.
 
మిధునం: దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభాదాయకంగా ఉంటుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. రాజకీయ నాయకులు తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలకైచేయు ప్రయత్నాలు వాయిదాపడును.
 
కర్కాటకం: గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. ఉన్నతంగా ఎదగాలనే మీ లక్ష్యానికి చేరువవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. ముఖ్యంగా ప్రింట్, మిడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
 
సింహం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగనమిస్తారు. నూతన ఎగ్రిమెంట్లు వాయిదా వేయండి. ఇతరులు మీ నుంచి ఏమి కోరుకుంటున్నారో ముందు తెలుసుకొండి. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.
 
కన్య: ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తకరంగా సాగుతాయి. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. పొదుపు చేయాలనే ప్రయత్నము ఫలించదు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. బంధు మిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెందుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు.
 
తుల: రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో వారికి అనుకూలం. నూతన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. దంపతుల స్ధిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. విదేశీయాన ప్రయాణాలు వాయిదాపడతాయి. అనుకున్నవి సాధించే విషయంలో రాజీపడవద్దు.
 
వృశ్చికం: పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. దూరప్రయాణాలలో  వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించడి. పత్రక, వార్తా సంస్థలోని వారికి సదవకాశాలు లభిస్తాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. స్ర్తీలతో మితంగా సంభాషించండి.
 
ధనస్సు: కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. అవివాహితులకు శుభదాయకం. మొండి బాకీల వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి. చిన్నతరహా, చిరువృత్తుల వారికి సరైన తృప్తి లభిస్తుంది. దంపతుల మధ్య నూతన విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
 
మకరం: దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో నిరుత్సాహం తప్పదు. ప్రేమవ్యవహారాలు పెళ్ళికి దారితీయవచ్చు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలెదురవుతాయి.
 
కుంభం: ఆర్ధిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. కీడు తలపెట్టె స్నేహానికి దూరంగా ఉండండి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. కోళ్ళ, మత్య్స, పాడి పరిశ్రమ, గొఱ్ఱెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి. స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడగలవు.
 
మీనం: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్విహిస్తారు. ఇంటి పనులలో నిమగ్నం అవుతారు. ఖర్చులు అంతగా లేకున్నాధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యములో మెళకువ అవసరం. మీ చుట్టు ప్రక్కలవారి ధోరణి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది.