ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 11 జులై 2019 (08:56 IST)

11-07-2019 గురువారం దినఫలాలు - ఆదాయ వ్యయాల్లో...

మేషం: మందులు, ఫాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలం. నిరుద్యోగులకు స్థిరమైన అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ఆకస్కిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. విదేశాలు వెళ్ళడానికి చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం: కొంతమంది మీ పై అభాండాలు వేసేందుకు యత్నిస్తారు. ఎదుటి వారితో వీలైనంత క్లుప్లంగా సంభాషించటం శ్రేయస్కరం. ఉద్యోగస్తుల శ్రమ, సమర్థతలకు గుర్తింపు లభిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు ధ్యేయంపట్ల ఏకాగ్రత నెలకొంటుంది.
 
మిధునం: ఆర్థిక ఇబ్బంది ఉండదు. వాస్తవానికి మీరు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. విద్యార్థులకు ఉన్నత కోర్సుల్లో అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.
 
కర్కాటకం: ప్రభుత్వ కార్యాలయాలలో పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
సింహం: విద్యార్ధులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. అవసరాలకు సరిపడ ధనం సర్ధుబాటు కాగలదు. ప్రత్యర్ధులు మిత్రులుగా మారి సహాయం అన్నివిధాలా నిదానంగా సాగటంమంచిది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత వంటివి తప్పవు. సోదరి, సోదరుల పోరు అధికంగా ఉంటుంది.
 
కన్య: రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి ఖర్చులు అధికమవుతాయి. బ్యాంకు పనులు అనుకూలం. విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలం. ఉదోగ్యస్తుల శ్రమను పై అధికారులు గుర్తిస్తారు.
 
తుల: స్త్రీలకు పనిభారంవల్ల ఆరోగ్యము మందగిస్తుంది. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు, వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. స్ర్తీల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. మార్కెటింగ్, ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి అవ్వడం కష్టతరమవుతుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
వృశ్చికం: ఆర్ధిక విషయాలలో ఏకాగ్రత అవసరం. సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. స్పెక్యులేషన్ సామాన్యంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ముఖ్యమైన  వ్యవహారాలు ఇతరుల జోక్యం వలన వాయిదా పడతాయి.
 
ధనస్సు: ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు విరక్తి కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి లాభాదాయకంగా ఉంటుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పాత వస్తువులను కొనడంవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మకరం: హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. స్ర్తీల ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు సంతృప్తికరంగా సాగుతాయి. రావలసిన ధనం చేతికందడంతో మానసికంగా కుదుటపడతారు.
 
కుంభం: ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే కాని పనులు నెరవేరవు. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో మెళుకువ వహించండి. సాంకేతిక, వైద్య రంగాల్లోని  వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టకాలంలో బంధువుల అండగా నిలుస్తారు. రాత పరీక్షల యందు మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు.
 
మీనం: ఆర్ధిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కొవలసి వస్తుంది. మిత్రుల కలియికతో మానసిక ప్రశాంతత పొందుతారు. మీ జీవిత భాగస్యామితో సఖ్యత నెలకొంటుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలంగా ఉంటుంది.