1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. Rs.4 crore assets to Tirumala Temple

సర్వం స్వామికే... రూ. 4 కోట్ల ఆస్తిని తిరుమలకు రాసిస్తానంటున్న వృద్ధురాలు

TTD
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.4 కోట్ల ఆస్తిని తిరుమల వేంకటేశ్వర స్వామికి రాసిచ్చేందుకు ఓ వృద్ధురాలు సిద్ధమయ్యింది. చిత్తూరు జిల్లా నాగలాపురానికి చెందిన పద్మావతి (85)పేరిట దాదాపు రూ.4 కోట్ల ఆస్తి ఉంది. నా అన్నవారు లేకపోవటం, ఆలనాపాలనా చూసుకునే వారు కరువవటంతో తన ఆస్తిని శ్రీవారికి విరాళంగా ఇచ్చేందుకు ఆస్తు లకు సంబంధించిన పత్రాలతో తిరుమల వచ్చారు. 
 
చెయ్యి విరిగి లేవలేని స్థితిలో ఉన్న ఆమె తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ రెవెన్యూ అధికారులకు తన ఆస్తి పత్రాలను ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. తనపై ఉన్న ఆస్తి అన్యాక్రాంతమవుతోందని.. కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇతరులకు పోకుండా, ఇష్టదైవమైన శ్రీవారి పాదాల చెంత ఉంచి, తుదిశ్వాస విడుస్తానని చెప్పారు.
About Writer
pyr