1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. AP CM Lauds TTD's Conservation Efforts In Seshachalam Hills

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

Tirumala
శేషాచలం కొండల్లో నిరంతర పరిరక్షణ కృషి ద్వారా తిరుమలలో 89.4 శాతం అటవీ విస్తరణను సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డును అభినందించారు. తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) ప్రకారం, టీటీడీ పరిధిలోని మొత్తం 2,719 హెక్టార్లలో దాదాపు 2,431 హెక్టార్లు అటవీ వృక్షసంపదతో నిండి ఉన్నాయని, దీని ఫలితంగా తిరుమలలో 89.4 శాతం పచ్చదనం ఏర్పడిందని టీటీడీ తెలిపింది. 
 
పవిత్రమైన శేషాచల కొండ శ్రేణులలో అటవీ సంపదను రక్షించడానికి, స్థానిక వృక్ష జాతులను పునరుద్ధరించడానికి మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఆలయ సంస్థ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. 
 
"మన సంప్రదాయాలు ప్రకృతిని పవిత్రంగా భావిస్తాయి. అడవులను, వన్యప్రాణులను రక్షించడం దైవ సేవతో సమానం. భవిష్యత్ తరాలకు మరింత పచ్చని, ఆరోగ్యకరమైన తిరుమలను అందించడంలో సహాయపడే ఈ ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను"అని ఏపీ సీఎం ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా టీటీడీ శేషాచలం కొండల ప్రాంతమంతటా స్థానిక వృక్షాల పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు, ఔషధ మొక్కల పరిరక్షణ కార్యక్రమాల వంటి పలు కార్యక్రమాలను చేపట్టింది. తిరుపతిలోని శేషాచలం కొండల శిఖరాగ్రంపై కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయానికి టీటీడీ అధికారిక సంరక్షక సంస్థగా వ్యవహరిస్తోంది. 1980 నుండి, ఇది పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే, లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ శేషాచలం కొండల అపారమైన అటవీ సంపదను సంరక్షిస్తోంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?