భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి
మంగళవారం నాడు వచ్చే త్రయోదశి తిథిని భౌమ ప్రదోషం అని అంటారు. ఈ రోజున ప్రదోష కాంలో.. అంటే సూర్యస్తమయ సమయంలో శివపార్వతులను, హనుమంతుడిని ఆరాధించడం వల్ల పలు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. అప్పుల బాధలతో వున్నవారు భౌమ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే రుణ విముక్తి కలుగుతుంది. దీర్ఘకాలిక అప్పుల బాధతో వున్నవారు, తీవ్రమైన ఆర్థిక సమస్యలున్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మేలు కలుగుతుంది.
అలాగే కుజ దోష ప్రభావాలు కూడా తగ్గుతాయి. ఆస్తి సంబంధ వివాదాలతో ఇబ్బందిపడుతున్నవారు, కోర్టు చిక్కులతో సతమతమయ్యేవారికి పరిష్కారం లభిస్తుంది. ఈ ప్రదోష కాలంలో పరమేశ్వరుడు శివ తాండవం చేస్తాడనీ, ఆ సమయంలో పూజ చేయడం వల్ల సకల పాపాలు పరిహారం అవుతాయని విశ్వాసం. సాధారణ ప్రదోషం కంటే భౌమ ప్రదోష కాలంలో చేసే పూజకు అనంతమైన ఫలితం లభిస్తుందని నమ్మకం. ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, శత్రుభయం వున్నవారు ఈరోజున పూజ చేయడం వల్ల అవన్నీ తొలగుతాయి. సంతాన ప్రాప్తి కోసం భౌమప్రదోషం నాడు ఆరాధన చేస్తే ఫలితం వుంటుందని విశ్వాసం.
